బాలికపై ఏడుగురు యువకుల అత్యాచారా ఘటన... 1 y ago
AP: బంధువుల ఇంటికి వచ్చి ఒంటరిగా బయటకు వచ్చిన ఒక బాలికపై ఏడుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘోర సంఘటన జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరుకు చెందిన బాలిక పక్కింటి మహిళతో కలిసి వీరపనేనిగూడెం వచ్చింది. ఒక వివాదం తలెత్తడంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఆ ఇంటి నుంచి ఒంటరిగా బయటకు రావడాన్ని గమనించిన ఓ బాలుడు కేసరపల్లికి చెందిన యువకులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు నాలుగు రోజులపాటు ఆమెను నిర్బంధించి, అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత ఆమెను సోమవారం ఆటోలో తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలేశారు. ఓ ఆటోడ్రైవర్ ఆమెను గమనించి, వివరాలు కనుక్కుని మాచవరం ఠాణాకు తీసుకెళ్లి అప్పగించగా, బాలిక మాట్లాడలేని స్థితిలో ఉండటంతో పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.